Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పారేవుల శంకర లింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కు మరమ్మతులకై నిధులు కేటాయిస్తాం

    Author VENKATESH | 15 Jul 2026, 09:03 PM | నారాయణపేట
    పారేవుల శంకర లింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కు   మరమ్మతులకై నిధులు కేటాయిస్తాం

    మంత్రి వాకిటి శ్రీహరి
    నారాయణపేట, జూలై 15 (బి వి కే న్యూస్)
    నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పారేవుల శంకర లింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతులకు అవసరమైన నిధులు కేటాయించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు.
    బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పారేవుల విష్ణువర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
    చాలాకాలంగా మరమ్మతులకు నోచుకోని లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు నిధులు మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని ప్రతినిధులు కోరగా, అవసరమైన నిధులు విడుదల చేయించి మరమ్మతులు పూర్తి చేసి సాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పారేవుల విష్ణువర్థన్ రెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్షుడు ఎం. గోపాల్, ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేష్, మాజీ సర్పంచ్ మనీ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.