Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌పై చేసిన ఆరోపణలు నిరాధారం

    Author VENKATESH | 16 Jul 2026, 04:37 PM | నారాయణపేట
    మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌పై చేసిన ఆరోపణలు నిరాధారం

    - పనిచేసే వారిపై ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్పవలసి ఉంటుంది
    - ఐదు శాఖలను అట్టహాసంగా నడుపుతున్న మంత్రి వాకిటి శ్రీహరి
    - మంత్రి వాకిడి శ్రీహరి ఎదుగుదల చూసి ఓర్వలేకనే ఈ ఆరోహణ
    - కడిగిన ముత్యం మా మంత్రి వాకిటి శ్రీహరి
    - మత్స్యశాఖ జిల్లా చైర్మన్ కాంత్ కుమార్ ముదిరాజ్
    నారాయణపేట, జూలై 16 (బి వి కే న్యూస్)
    మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌పై చేసిన ఆరోపణలు నిరాధారణ మైనవని, పనిచేసే వారిపై ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్పవలసి ఉంటుందని, ఐదు శాఖలను అట్టహాసంగా నడుపుతున్న మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి వాకిటి శ్రీహరి ఎదుగుదల చూసి ఓర్వలేకనే ఈ ఆరోహణలు, కడిగిన ముత్యం మా మంత్రి వాకిటి శ్రీహరి అంటూ అన్నారు మత్స్యశాఖ జిల్లా చైర్మన్ కాంత్ కుమార్ ముదిరాజ్.
    గురువారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్పై ఇటీవల గంగపుత్ర చైతన్య సమితి ప్రతినిధులు చేసిన ఆరోపణలను కాంత్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మంత్రిని వ్యక్తిగత లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు, సామాజిక సామరస్యానికి విరుద్ధమన్నారు. ఏవైనా విమర్శలు చేయాలంటే వాస్తవాలు, ప్రభుత్వ జీవోలు, చట్టాలు, అధికారిక ఆధారాలతో చేయాలని సూచించారు.
    ముదిరాజ్ వర్గం కూడా సాంప్రదాయ మత్స్యకార వర్గమేనని ప్రభుత్వ రికార్డులు, కమిషన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అలాంటి చారిత్రక అనుబంధాన్ని కాదనడం సరైంది కాదని, ముదిరాజ్ సమాజానికి చెందిన లక్షలాది కుటుంబాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. చేప పిల్లల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. ఆరోపణలు చేసిన కాలంలో వాకిటి శ్రీహరి ముదిరాజ్ మత్స్యశాఖ మంత్రిగా కూడా లేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కోహెడ చేపల ఎక్స్‌పోర్ట్ మార్కెట్ శిలాఫలకం అంశాన్ని అనవసరంగా కుల వివాదంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని, ప్రోటోకాల్, శిలాఫలకాలకు సంబంధించిన అంశాలు జిల్లా యంత్రాంగం పరిధిలో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి సమస్యకు ఒక వ్యక్తిని లేదా ఒక సామాజిక వర్గాన్ని బాధ్యులను చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేనిచో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంత్ కుమార్ ముదిరాజ్ హెచ్చరించారు.