Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మక్తల్ ఏరియా ఆసుపత్రి పరిశీలన

    Author VENKATESH | 18 Jul 2026, 09:42 PM | నారాయణపేట
    మక్తల్ ఏరియా ఆసుపత్రి పరిశీలన

    శిథిలావస్థలోకి ఆసుపత్రి.. ఇబ్బందుల్లో రోగులు సిబ్బంది
    --నిర్మాణం ఉన్న నూతన ఆసుపత్రి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
    -సిపిఎం డిమాండ్
    నారాయణపేట, జూలై 18 (బి వి కే న్యూస్)
    మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ భవనాన్ని శనివారం సిపిఎం పార్టీ బృందం ఆధ్వర్యంలో సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు .
    ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ
    భవనం శిథిలావస్థలో ఉన్నదని ఎప్పుడు పడిపోతుందో తెలియని దుస్థితికి చేరుకున్నదని నూతన భవనం అయ్యేంతవరకు ఇట్టి భవనానికి తాత్కాలికంగా మరమతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
    నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి భవనాన్ని సరిత వ్యతిరే పూర్తి చేసి రోగులకు సేవలు అందే విధంగా చూడాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    రోగులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న విషయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. రోజుకు 400 నుండి 450 మంది వరకు ఔట్ పేషెంట్స్ వస్తుంటారని వారికి మెరుగైన వైద్యం అందించాలంటే శిథిలావస్థలో ఉన్న భవనంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. భువనములోని పెచ్చులు ఊడి పడుతున్నాయని అదే విధంగా గోడలలో చెట్లు మారుస్తున్నాయని వారు ఈ సందర్భంగా తెలిపారు.
    భవనం ఎప్పుడు పడిపోతుందని ఆందోళన నెలకొని ఉన్నదని అందువలన నూతనంగా నిర్మిస్తున్న ఏరియా హాస్పిటల్ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఇట్టి భవనాన్ని కొత్త భవనంలోకి మార్చాలని వారి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని.
    అనంతరం కర్నే పి ఎస్ సి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ను సందర్శించారు. కర్ని పి ఎస్ సి హాస్పిటల్కు ప్రహరీ గోడ లేకపోవడంతో పశువులు ఆకతాయిలు వచ్చే అవకాశం ఉందన్నారు.
    అలాగే ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు మొలసిన కారణంగా పరిసరాలు అపరిశుభ్రత వాతావరణం ఉన్నదన్నారు. వెంటనే ప్రహరీ గోడను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్నారు ప్రజా ఆరోగ్యం పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిపిఎం పార్టీ ఊరుకోదని ఉద్యమిస్తారని హెచ్చరించారు.
    ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కేయం మహేందర్, అశోక్, నరేష్, కోళ్ల అశోక్, జి బాల్రాజ్, బి శివ తదితరులు పాల్గొన్నారు.