Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భూత్పూర్‌లోని పౌల్ట్రీఫారంపై ఈగల్ ఫోర్స్ దాడి..

    Author VENKATESH | 19 Jul 2026, 07:03 PM | మహబూబ్ నగర్
    భూత్పూర్‌లోని పౌల్ట్రీఫారంపై ఈగల్ ఫోర్స్ దాడి..

    మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లోని పౌల్ట్రీ ఫారంపై ఈగల్ ఫోర్స్, నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తయారు చేస్తున్న కిలోకు పైగా అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి మొత్తం 35 మందిని గుర్తించారు. వారిలో 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 23 మంది పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో వారిపై క్రైమ్ నెం.20/2026 కేసు నమోదు చేశారు.
    ఈ కేసులో ప్రధాన నిందితుడు మలేలా జయప్రకాశ్ గౌడ్‌ను ఈగల్ ఫోర్స్ గుర్తించింది. 2025లో ఇదే కేసులో అతడు అరెస్టయ్యాడు. ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం బెయిల్‌పై విడుదలై.. మళ్లీ డ్రగ్స్ తయారు చేయడం ప్రారంభించినట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. అలాగే ఇదే కేసులో కృష్ణయ్య గౌడ్ కీలక నిందితుడుగా ఉన్నారని తెలిపింది. అతడు కూడా పరారీలో ఉన్నాడని పేర్కొంది. అతడు పలుమార్లు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడని వెల్లడించింది.