Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 2వ తరగతి ఫౌండేషనల్ లెర్నింగ్ సర్వేలో రాష్ట్రంలో 3వ స్థానం సాధించిన నారాయణపేట జిల్లా

    Author VENKATESH | 21 Jul 2026, 11:06 AM | నారాయణపేట
    2వ తరగతి ఫౌండేషనల్ లెర్నింగ్ సర్వేలో రాష్ట్రంలో 3వ స్థానం సాధించిన నారాయణపేట జిల్లా

    - డీఎస్ఈ శ్రీ నవీన్ నికోలస్, ఐఏఎస్ చేతుల మీదుగా జిల్లా విద్యాశాఖ అధికారి డా. ఎం. గోవిందరాజుకు ఘన సన్మానం
    నారాయణపేట, జూలై 20( బీవీకే న్యూస్ )
    ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాలు (Foundational Literacy and Numeracy - FLN) సాధనను అంచనా వేయడానికి *2వ తరగతి విద్యార్థులపై నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమెరసీ సర్వే (FLN సర్వే)లో *నారాయణపేట జిల్లా రాష్ట్రంలో 3వ స్థానం సాధించి విశిష్ట ప్రతిభ కనబరిచింది.
    హైదరాబాద్‌లోని *మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో **పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)*పై నిర్వహించిన రాష్ట్రస్థాయి రెండురోజుల కార్యశాల సందర్భంగా, 2వ తరగతి ఎఫ్‌ఎల్‌ఎన్‌ సర్వేలో నారాయణపేట జిల్లా సాధించిన అత్యుత్తమ ప్రతిభను గుర్తిస్తూ పాఠశాల విద్యా సంచాలకులు (DSE) శ్రీ నవీన్ నికోలస్, ఐఏఎస్ జిల్లా విద్యాశాఖ అధికారి డా. ఎం. గోవిందరాజు గారిని ఘనంగా సన్మానించి అభినందించారు.
    ఈ సందర్భంగా డీఎస్ఈ గారు మాట్లాడుతూ, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమెరసీ (FLN) కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, నిరంతర విద్యా పర్యవేక్షణ, ఉపాధ్యాయుల అంకితభావం, జిల్లా విద్యాశాఖ యంత్రాంగం సమిష్టి కృషి వల్లనే నారాయణపేట జిల్లా ఈ విశిష్ట విజయాన్ని సాధించిందని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
    ఈ కార్యక్రమంలో ఎస్‌సీఈఆర్ట్ డైరెక్టర్ శ్రీ గాజర్ల రమేష్, ఆర్‌జేడీ శ్రీ సోమిరెడ్డి, సీఎస్‌ఎఫ్ (CSF) ప్రతినిధి శ్రీ సురేష్ పాల్గొని జిల్లా బృందాన్ని అభినందించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు.
    ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి డా. ఎం. గోవిందరాజు మాట్లాడుతూ, ఈ గౌరవం తనకు వ్యక్తిగతంగా దక్కినది కాదని, జిల్లాలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమెరసీ (FLN) బలోపేతానికి అంకితభావంతో కృషి చేసిన ప్రతి ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ (CHM), క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (CRP), మండల విద్యాధికారి (MEO), అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (AMO), రిసోర్స్ పర్సన్లు (MRPs/DRPs), సెక్టోరల్ అధికారులు మరియు విద్యాశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది సమిష్టి కృషికి దక్కిన గుర్తింపని పేర్కొన్నారు.
    ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డా. ఎం. గోవిందరాజు గారితో పాటు అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (AMO) శ్రీ విద్యాసాగర్, సెక్టోరల్ అధికారులు శ్రీ రాజేంద్రకుమార్, శ్రీ నాగార్జునరెడ్డి, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (CRP) శ్రీ శివకుమార్ పాల్గొని జిల్లాకు దక్కిన ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని స్వీకరించారు.
    జిల్లాకు ఈ గౌరవాన్ని తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ జిల్లా విద్యాశాఖ అధికారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రతి విద్యార్థిలో పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇదే నిబద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.