Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎం.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

    Author VENKATESH | 21 Jul 2026, 11:07 AM | నల్గొండ
    ఎం.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

    దేవరకొండ 20జూలై (BVK 3 న్యూస్ ) :
    దేవరకొండ పట్టణంలోని ఎం.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్ )2026- 27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమావత్ రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పీజీలో 55% మార్కులు ఉన్నవారు అర్థులని తెలిపారు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలని పేర్కొన్నారు. పీహెచీడి /నెట్/ సెట్ మరియు బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఖాళీల వివరాలు తెలుగు -1, ఇంగ్లీష్-1, హిస్టరీ-1, ఎకనామిక్స్-1, పొలిటికల్ సైన్స్-1, కామర్స్–2, కంప్యూటర్ సైన్స్-2, జువాలజీ-1, బోటనీ-1, మ్యాథ్స్-1, ( రివైజ్డ్ - 11 పోస్ట్స్ బదులుగా 12 పోస్ట్స్ ఇవ్వటం జరిగింది. అదనంగా మ్యాథ్స్ లో ఒక పోస్ట్స్ ఇవ్వటం జరిగింది) ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను కళాశాల కార్యాలయంలో 21/07/2026 వ తేదీ సాయంత్రం 4:30 గంటల లోపు అందజేయాలని తెలిపారు. ఇంటర్వ్యూ తేదీ మరియు సమయము, ఇంటర్వ్యూ జరుగు స్థలం వివరాలను అభ్యర్థులకు చరవాణి ద్వారా తెలియజేస్తారని పేర్కొన్నారు. ఇతర వివరాలకు సెల్ :9989753238, 9912740993 సంప్రదించాలని తెలిపారు.