Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎప్పుడూ ఆకలిగా అనిపిస్తుందా? ఈ ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు..!

    Author VENKATESH | 24 Jul 2026, 01:57 PM | HEALTH
    ఎప్పుడూ ఆకలిగా అనిపిస్తుందా? ఈ ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు..!

    ఆకలి వేయడం సహజం. ఎందుకంటే మన శరీరానికి పనిచేయడానికి ఆహారం ద్వారా శక్తి అవసరం. అయితే, భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలిగా అనిపించడం లేదా రోజంతా ఏదో ఒకటి తినాలనిపించడం మాత్రం సాధారణం కాదు. ఇలాంటి పరిస్థితిని నిర్లక్ష్యం చేయకుండా కారణాన్ని తెలుసుకోవడం అవసరం.
    ఎక్కువగా వ్యాయామం చేసే వారు, ఎదుగుతున్న పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఆకలి ఎక్కువగా ఉండటం సహజమే. కానీ ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా చాలా రోజుల పాటు ఆకలి ఎక్కువగా ఉంటే, అది మధుమేహం, థైరాయిడ్ సమస్యలు లేదా ఇతర హార్మోన్ల సమస్యలకు సంకేతం కావచ్చు. మీకు తరచూ ఆకలి వేయడంతో పాటు బరువు తగ్గడం, ఎక్కువ దాహం వేయడం, తరచూ మూత్రానికి వెళ్లడం, అలసట వంటి లక్షణాలు కూడా ఉంటే తప్పకుండా వైద్యులని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
    డయాబెటిస్
    మధుమేహం ఉన్నప్పుడు శరీరం రక్తంలోని గ్లూకోజ్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోతుంది. దీంతో శరీరానికి అవసరమైన శక్తి అందకపోవడంతో మళ్లీ మళ్లీ ఆకలి వేస్తుంది. ఈ పరిస్థితిని పాలీఫేజియా అంటారు.
    హైపర్ థైరాయిడిజం
    థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయితే శరీర జీవక్రియ వేగంగా పనిచేస్తుంది. దీంతో శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ఫలితంగా ఆకలి కూడా పెరుగుతుంది.
    హైపోగ్లైసీమియా
    రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గితే తీవ్రమైన ఆకలి, చేతులు వణకడం, చెమటలు పట్టడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
    మానసిక ఒత్తిడి
    ఒత్తిడి, ఆందోళన లేదా భావోద్వేగాల కారణంగా కొందరు అవసరానికి మించి తింటుంటారు. దీనినే ఎమోషనల్ ఈటింగ్ అంటారు.
    నెలసరి సమయం
    నెలసరి రాకముందు హార్మోన్లలో మార్పుల వల్ల మహిళలకు సాధారణంగా ఆకలి ఎక్కువగా ఉంటుంది.
    కొన్ని మందుల ప్రభావం
    స్టెరాయిడ్లు, కొన్ని యాంటీ డిప్రెసెంట్ మందులు, మరికొన్ని ఔషధాలు కూడా ఆకలిని పెంచే అవకాశం ఉంది.
    తరచూ ఆకలి వేస్తే ఏమి చేయాలి?
    గుడ్లు, పాలు, పప్పులు, పనీర్ వంటి ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
    తృణధాన్యాలు, పీచుపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తినాలి.
    జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించాలి.
    రోజంతా తగినంత నీరు తాగాలి.
    సమయానికి భోజనం చేయాలి.