Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అభిషేక్‌ శర్మ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలి..

    Author VENKATESH | 28 Jul 2026, 12:25 PM | Sports
     అభిషేక్‌ శర్మ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలి..

    ఇటీవలి కాలంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడిని తుది జట్టు నుంచి పక్కన పెట్టాలని భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth)సెలెక్టర్లకు సూచించారు. అలాగే వరల్డ్‌ కప్(T20 world cup)హీరో సంజూ శాంసన్‌కు మళ్లీ జాతీయ జట్టులో అవకాశం ఇవ్వాలని ఆయన అభిప్రాయప డ్డారు. అభిషేక్‌ శర్మ తన చివరి 10 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక్క అర్ధశతకంతో కేవలం 191 పరుగులు మాత్రమే నమోదు చేశాడని గుర్తు చేశారు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తన చివరి నాలుగు ఇన్నింగ్స్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యాడు.
    అలాగే మొన్న ముగిసిన జింబాబ్వే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలోనూ అభిషేక్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడు. తన మూడు ఇన్నింగ్స్‌లలోనూ జింబాబ్వే పిచ్‌లపై ముజరంబాని బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయాడు. దీనికి ముందు ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లతో జరిగిన సిరీస్‌లలో కూడా అభిషేక్ బ్యాటింగ్‌లో తన సాధారణ ఫామ్‌ను ప్రదర్శించలేకపోయాడు.