Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళ్ మిలన్ సమావేశం..

    Author VENKATESH | 28 Jul 2026, 12:56 PM | NATIONAL
    ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళ్ మిలన్ సమావేశం..

    ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ (మంగళవారం) పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ 'మంగళ్ మిలన్' సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ సభా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు.
    ఈ సమావేశంలో ప్రధానంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు-2026' ఆమోదంపై వ్యూహాన్ని ఖరారు చేశారు. పేపర్ లీక్‌లు, మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టేందుకు ఈ బిల్లులో కఠిన నిబంధనలు ప్రతిపాదించారు. నేరస్థులకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించడంతో పాటు, కేసుల వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించినట్లు సమావేశంలో చర్చించారు. ఇక భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) వల్ల కలుగుతున్న ప్రయోజనాలను కూటమి ఎంపీలకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. భారత ఎగుమతుల పెరుగుదల, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల విస్తరణలో ఈ ఒప్పందాలు కీలకంగా మారాయని ఆయన పేర్కొన్నారు.