Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హిమాచల్ ప్రదేశ్‌ చంబా జిల్లాలో ఘోర ప్రమాదం..

    Author VENKATESH | 28 Jul 2026, 01:23 PM | NATIONAL
    హిమాచల్ ప్రదేశ్‌ చంబా జిల్లాలో ఘోర ప్రమాదం..

    చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తూ లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. చనిపోయిన వారిలో ఏడాది వయసున్న చిన్నారి ఉండటం స్థానికుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి భరమౌర్-పఠాన్‌కోట్ రహదారి లహార్ సమీపంలో జరిగింది. చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బాధిత కుటుంబం పఠాన్‌కోట్‌కు కారులో బయలుదేరింది. చిన్నారి తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ కలిసి సోమవారం రాత్రి రోడ్డు మార్గాన బయలుదేరారు.
    అయితే, లహార్ సమీపానికి రాగానే కారు ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించనప్పటికీ.. కారు నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. రాత్రి వేళ కావడంతో ప్రమాదాన్ని గుర్తించేందుకు చాలా సమయం పట్టింది. అనంతరం స్థానికుల సమాచారంతో పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.