Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓటీటీలోకి పాప్ కింగ్ బ‌యోపిక్ ‘మైఖేల్’..

    Author VENKATESH | 28 Jul 2026, 04:52 PM | Cinema
    ఓటీటీలోకి పాప్ కింగ్ బ‌యోపిక్ ‘మైఖేల్’..

    పాప్ ప్రపంచంలో తనదైన మూన్‌వాక్ డాన్స్‌తో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ బయోపిక్ ‘మైఖేల్’ ఎట్ట‌కేల‌కు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది.
    ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి రానుంది. మైఖేల్ జాక్సన్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌లోని పిపాక్ హబ్ (Peacock Hub)లో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలోనూ ఈ చిత్రాన్ని వీక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జియోహాట్‌స్టార్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ప్యాన్ గ్లోబల్ స్థాయిలో ఆకట్టుకున్న ఈ సంగీత దృశ్యకావ్యంలో మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన అల్లుడు జాఫర్ జాక్సన్ అద్భుత నటనతో అలరించారు. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవడంతో సంగీత ప్రియులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.