Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థి మృతికి కారణమైన లెక్చరర్‌పై కేసు నమోదు చేయాలని ధర్నా

    Author VENKATESH | 29 Jul 2026, 12:48 PM | మహబూబ్ నగర్
    విద్యార్థి మృతికి కారణమైన లెక్చరర్‌పై కేసు నమోదు చేయాలని ధర్నా

    గద్వాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ సెకండియర్ చదువుతున్న ఇంటర్‌ విద్యార్థి మృతి ( Student Death ) కి కారణమైన కాంట్రాక్ట్‌ లెక్చరర్‌పై కేసు నమోదు (Case Against Lecturer ) చేయాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు బుధవారం ధర్నా నిర్వహించాయి.
    గద్వాల రూరల్ కొత్తపల్లికి చెందిన నేతిబొట్టు తరుణ్ ( Tarun ) ఫస్టియర్ ఫలితాల్లో జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచాడు. శనివారం తరుణ్‌ను మహిళా లెక్చరర్ తీవ్రంగా అవమానించింది. 435 మార్కులు వచ్చిన మొదటి ర్యాంకర్‌తో పోలుస్తూ తిట్టింది.
    నువ్వేమైనా మంత్రి కొడుకువా, అంతకంటే గొప్పోడివా అంటూ తరుణ్ చెంపపై లెక్చరర్ కొట్టింది. అది చూసి క్లాస్‌లోని విద్యార్థులంతా నవ్వారు. దాన్ని అవమానంగా భావించి తరుణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. లెక్చరర్ అవమానపరిచిందని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.