Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘పెళ్లిచూపులు’కు పదేళ్లు.. విజయ్ దేవరకొండ కెరీర్‌ను మార్చేసిన కల్ట్ క్లాసిక్

    Author VENKATESH | 29 Jul 2026, 12:57 PM | Cinema
    ‘పెళ్లిచూపులు’కు పదేళ్లు.. విజయ్ దేవరకొండ కెరీర్‌ను మార్చేసిన కల్ట్ క్లాసిక్

    తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘పెళ్లిచూపులు’ విడుదలై నేటికి (జులై 29) పదేళ్లు పూర్తి చేసుకుంది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 2016లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దర్శకుడిగా తరుణ్ భాస్కర్ పరిచయమైన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు సమర్పణలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. సహజమైన కథనం, వినోదభరితమైన సంభాషణలు, కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, అప్పటి వరకు పెద్దగా గుర్తింపు లేని పలువురు ప్రతిభావంతులకు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టింది.
    ‘పెళ్లిచూపులు’ విజయ్ దేవరకొండ కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. సోలో హీరోగా ఆయనకు ఇది తొలి పెద్ద విజయం. సినిమాలో విజయ్ నటన, సహజమైన డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలు అందుకున్న విజయ్, ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి విజయాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రీతూ వర్మ తన సహజమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుని ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందింది.
    ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ తొలి సినిమాతోనే తన ప్రత్యేక శైలిని నిరూపించుకున్నారు. ‘పెళ్లిచూపులు’ తర్వాత టాలీవుడ్‌లో క్రేజీ దర్శకుడిగా ఎదిగిన ఆయన, అనంతరం నటుడిగానూ తనదైన గుర్తింపు సంపాదించారు.బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పెళ్లిచూపులు’ అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు లభించాయి. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘పెళ్లిచూపులు’ జాతీయ పురస్కారం అందుకోగా, ఉత్తమ మాటల రచయితగా దర్శకుడు తరుణ్ భాస్కర్ నేషనల్ అవార్డు అందుకున్నారు.