Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మెమో రైళ్ల రద్దుతో ఇబ్బందులు

    Author VENKATESH | 29 Jul 2026, 01:11 PM | ANDHRA PRADESH
    మెమో రైళ్ల రద్దుతో ఇబ్బందులు

    నాయుడుపేట స్వర్ణముఖినది వంతెనపై మరమ్మతులతో పలు మెమో రైళ్లు రద్దు కాగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కొంత ఆలస్యంగా నడిచాయి. స్వర్ణముఖినది వంతెనలో ఉన్న ఇనుక గడ్డర్ల స్థానంలో సిమెంట్‌ గడ్డర్ల ఏర్పాటుకు రైల్వేశాఖ సిద్ధమైంది.10 రోజులుగా ఆ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీంతో రెండు రోజులుగా పలు మెమో రైళ్లను రద్దు చేశారు.
    మంగళవారం సూళ్లూరుపేట నుంచి నెల్లూరుకు ఉదయం 8.05 గంటలకు, 10 గంటలకు వచ్చే మెమో రైళ్లు, అలాగే నెల్లూరు నుంచి సూళ్లూరుపేటకు ఉదయం 10.20, సాయంత్రం 4.00 గంటలకు వచ్చే మెమో రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. ఈ రైళ్లు చెన్నై, సూళ్లూరుపేట మధ్య మాత్రమే నడిచేలా నిర్ణయించి ఆ రైళ్లను సూళ్లూరుపేటలో నిలిపివేశారు. అలాగే కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కొంత ఆలస్యంగా నడిచాయి. గురువారం కూడా ఈ రైళ్లు రద్దు కానున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.