Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం

    Author VENKATESH | 29 Jul 2026, 01:18 PM | ANDHRA PRADESH
    జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం

    జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. అడవుల పరిరక్షణలో భాగస్వాములైన ప్రకృతి ప్రేమికులందరికీ అంతర్జాతీయ పులుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పులుల సంరక్షణలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. తూర్పు కనుమల్లో పులుల పునరుజ్జీవం వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు.
    నల్లమలలో పులి గర్జన శాశ్వతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. పులి కేవలం మన జాతీయ జంతువు మాత్రమే కాదని, మన దేశ అటవీ సంపదకు, జీవ వైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు ప్రతీక అని ఉద్ఘాటించారు. ప్రపంచ పులుల దినోత్సవం… 2010లో పులుల సంరక్షణ కోసం అంతర్జాతీయ సమాజం తీసుకున్న సంకల్పాన్ని మనకు గుర్తు చేస్తుందని తెలిపారు.