Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి

    Author VENKATESH | 29 Jul 2026, 02:02 PM | TELANGANA
    ‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి

    ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియను కాంగ్రెస్ బీఎల్ఏలు వేగవంతం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్‌పై జిల్లా ఇన్‌చార్జ్, జిల్లా పీసీసీలతో చర్చించి ముగ్గురు సభ్యులతో ప్యానల్ ఏర్పాటు చేసి నివేదిక అందించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని సూచించారు. బీఎల్ఏలు(BLA) బాగా పనిచేస్తున్నారని అభినందించారు. ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఈరోజు జరిగిందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
    ‘సర్’ ప్రక్రియ దురుద్దేశంతో జరుగుతుంది: మహేశ్ కుమార్ గౌడ్
    ‘సర్’పై రివ్యూ చేశామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. 36 వేల మంది బీఎల్ఏ(BLA)లను నియమించినట్లు చెప్పారు. 50 నుంచి 60 శాతం ఈ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో వందశాతం పూర్తవుతుందని వివరించారు. అర్హతగల ఓటర్ల ఓటు హక్కు కాపాడటం తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈసారి ‘సర్’ ప్రక్రియ దురుద్దేశంతో జరుగుతుందని చెప్పారు. ఓట్లను కాపాడే ఉద్దేశంతో ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. సంస్థాగత బలోపేతం, పార్టీ ప్రభుత్వ సమన్వయంపై మాట్లాడామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
    కాగా, ఢిల్లీ ఇందిరా భవన్‌లో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఈరోజు (బుధవారం) జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీతక్క , సీడబ్యూసీ సభ్యులు మంత్రి దామోదర్ రాజానర్సింహ, వంశీ చంద్ పాల్గొన్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తెలంగాణలో ‘సర్’ ప్రక్రియ, పార్టీ - ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు.