Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న వైష్ణవి చైతన్య..

    Author VENKATESH | 03 Aug 2026, 12:58 PM | Cinema
    ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న వైష్ణవి చైతన్య..

    తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలు హైదరాబాద్ నగరంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని ప్రముఖ టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి విచ్చేసిన ఆమె, శిరస్సుపై బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించడం అక్కడికి వచ్చిన భక్తులను ఆకట్టుకుంది. ఆలయానికి చేరుకున్న వైష్ణవి చైతన్యకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్న వైష్ణవి కొంతసేపు ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు.Geographic Reference