Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

    Author VENKATESH | 06 Aug 2026, 05:01 PM | INTERNATIONAL
    షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

    బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ అవామీ లీగ్ ఎంపీ షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి చేశారు. మగురా పట్టణంలోని కేశబ్‌మోర్ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటిపై బుధవారం రాత్రి సుమారు 8.45 గంటలకు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. దుండగులు ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భారతదేశంలో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన వర్చువల్ విలేకరుల సమావేశానికి షకీబ్ అల్ హసన్ హాజరైన కొద్దిసేపటికే ఈ దాడి జరిగినట్లు అవామీ లీగ్ పేర్కొంది. న్యూఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో షకీబ్‌తో పాటు హసీనా కుమారుడు సజీబ్ వాసెద్ జాయ్, మాజీ విద్యాశాఖ మంత్రి మొహిబుల్ హసన్ చౌదరి కూడా పాల్గొన్నారు.