Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ర‌ష్యా త‌ర‌ఫు మ‌ధ్య‌వ‌ర్తిగా మాజీ సీజేఐ చంద్ర‌చూడ్

    Author VENKATESH | 12 Aug 2026, 01:05 PM | INTERNATIONAL
     ర‌ష్యా త‌ర‌ఫు మ‌ధ్య‌వ‌ర్తిగా మాజీ సీజేఐ చంద్ర‌చూడ్

    రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ‌కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన ప్రభుత్వరంగ బ్యాంకు ‘ఓస్చాడ్‌బ్యాంక్‌ ’ తో నెలకొన్న పెట్టుబడుల వివాదంలో రష్యా తమ తరఫు మధ్యవర్తి గా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను నియమించింది. ఈ వివాదంపై 1998లో రష్యా, ఉక్రెయిన్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద విచారణ జరుగుతోంది.రష్యా సైనిక చర్యల కారణంగా డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిఝియా ప్రాంతాల్లో తమ ఆస్తులకు, కార్యకలాపాలకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ ఓస్చాడ్‌బ్యాంక్ ఈ కేసు దాఖలు చేసింది. ముఖ్యంగా 2022 తర్వాత జరిగిన పరిణామాలతో వందల మిలియన్ డాలర్ల నష్టం జరిగిందని పరిహారం కోరుతోంది. ఈ మేరకు 2025 జూలైలో వివాద పరిష్కారం కోసం రష్యాకు నోటీసులు పంపినా స్పందన రాకపోవడంతో అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.