Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విమానాలు మారిన విషయం నిజమే

    Author VENKATESH | 13 Aug 2026, 12:14 PM | INTERNATIONAL
    విమానాలు మారిన విషయం నిజమే

    గత నెలలో టర్కీలో నాటో సదస్సుకు హాజరైన తర్వాత తిరుగు ప్రయాణంలో రహస్యంగా విమానాలను మార్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ముప్పు ఎదురయ్యే అవకాశం ఉన్నందునే అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. ‘సీక్రెట్ సర్వీస్, సైన్యం సూచించిన విధంగా నడుచుకున్నా. వేరే విమానంలో ప్రయాణించాలని వారు నన్ను అడిగారు’ అని తెలిపారు. గత నెల 8న టర్కీ నుంచి బ్రిటన్ వెళ్లేందుకు కెమేరాల ఎదుట ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని ఎక్కిన ట్రంప్ ఆ తర్వాత కేటరింగ్ ట్రక్కులో దాక్కుని ఓ సైనిక విమానంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. ‘నేను ఎక్కిన జెట్ విమానం మరింత ప్రమాదంలో పడి ఉండేది. ఎందుకంటే వారు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్న విమానం అదేనని నేను అనుకుంటున్నాను’ అని ట్రంప్ తెలిపారు. బయట ఏదో ముప్పు పొంచి ఉన్నదని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. ‘నేను దాని గురించి పెద్దగా ఆరా తీయలేదు. ఎందుకంటే నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి’ అని అన్నారు. మీకు తెలియని బెదిరింపులు తనకు చాలానే ఉన్నాయని విలేకరులను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.