Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నడిరోడ్డుపై యూట్యూబర్‌ను కాల్చి చంపిన దుండగులు

    Author VENKATESH | 20 Aug 2026, 12:39 PM | Crime
    నడిరోడ్డుపై యూట్యూబర్‌ను కాల్చి చంపిన దుండగులు

    పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాకర్‌, యూట్యూబర్ షమ్సో బీబీ దారుణ హత్యకు గురయ్యారు. 28 ఏళ్ల ఈ యువతికి టిక్‌టాక్‌లో 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆగస్టు 14న టాక్సిలా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షమ్సో తన సోదరుడు, సోదరితో కలిసి కారులో వెళ్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి కాల్పులు జరిపారు. మృతురాలి తండ్రి ఫజల్‌ సాహిబ్‌జాదా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..కాశిఫ్‌ అనే వ్యక్తి షమ్సోకు ఫోన్‌ చేసి ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పాడు. దీంతో ఆమె తన చెల్లి, తమ్ముడితో కలిసి కారులో బయటకు వచ్చారు. కాసేపటికే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి షమ్సో ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. ఆ వెంటనే తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో షమ్సో బీబీ మెడలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ప్రమాదంలో షమ్సో బీబీ సోదరి అసీమా కూడా తీవ్రంగా గాయపడింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్నాయి.