Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అమెరికాతో వాణిజ్య చ‌ర్చ‌ల‌ను నిలిపివేసిన కెన‌డా ప్ర‌ధాని

    Author VENKATESH | 22 Aug 2026, 11:36 AM | INTERNATIONAL
     అమెరికాతో వాణిజ్య చ‌ర్చ‌ల‌ను నిలిపివేసిన కెన‌డా ప్ర‌ధాని

    అమెరికాతో వాణిజ్య చ‌ర్చ‌ల‌ను కెన‌డా నిలిపివేసింది. ఈ మేర‌కు కెన‌డా ప్ర‌ధాని(Canada PM) మార్క్ కార్నే ఓ ప్ర‌క‌ట‌న చేశారు. అమెరికా చేసిన వాణిజ్య ప్ర‌తిపాద‌న‌లు ఆమోద‌యోగ్యం లేవ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ట్రంప్ ప్ర‌తిపాద‌న‌లు అనైతికంగా ఉన్న‌ట్లు చెప్పారు. ఇటీవ‌ల అమెరికాతో జ‌రిగిన చ‌ర్చ‌ల ఆధారంగా వాణిజ్యం కొన‌సాగించాల‌ని భావించాం, కానీ త‌మ ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లు ఆ చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేద‌ని, అందుకే అమెరికాతో వాణిజ్య చ‌ర్చ‌ల‌ను నిలిపివేసిన‌ట్లు కార్నే తెలిపారు. సుమారు 28 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు చెందిన కెన‌డా వ‌స్తువుల‌పై 50 శాతం టారిఫ్ విధించాల‌ని అమెరికా భావిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ట్రంప్ ప్ర‌తిపాద‌న‌ల‌ను కెన‌డా వ్య‌తిరేకిస్తున్న‌ది.