Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టిబెట్‌లో డ్యామ్ లీకేజీ..

    Author VENKATESH | 28 Aug 2026, 12:21 PM | INTERNATIONAL
     టిబెట్‌లో డ్యామ్ లీకేజీ..

    టిబెట్‌లో డ్యామ్ లీకేజీ అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ నేపాల్(Nepal) హెచ్చ‌రిక జారీ చేసింది. సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాలంటూ ఆదేశాలు ఇచ్చింది. బుధ‌వార‌మే భారీ బుర‌ద‌తో కూడిన వ‌ర‌ద .. విల‌యాన్ని సృష్టించిన విష‌యం తెలిసిందే. అయితే టిబెట్ ప్రాంతంలో తాత్కాలిక స‌ర‌స్సు ఏర్ప‌డింద‌ని, అది ఏ క్ష‌ణ‌మైనా ప‌గిలే ఛాన్సు ఉన్న‌ట్లు చైనా హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. బుధ‌వారం సంభ‌వించిన జ‌ల‌ప్ర‌ళ‌యం మృతుల సంఖ్య 469కి చేరుకున్న‌ది. తాత్కాలిక స‌ర‌స్సు ఏర్ప‌డిన ప్ర‌దేశ వీడియోల‌ను సీసీటీవీ రిలీజ్ చేసింది. బుధ‌వారం కొట్టుకుపోయిన గిరాంగ్ పోర్టుకు 10 కిలోమీట‌ర్ల ఎగువ‌న ఆ స‌ర‌స్సు ఉన్న‌ట్లు తెలిసింది. అక్క‌డ సుమారు రెండు మిలియ‌న్ల క్యూబిక్ మీట‌ర్ల నీరు ఉన్న‌ది. ప్ర‌స్తుతం ఆ బేరియ‌ర్ లేక్ నుంచి నీరు లీకు అవుతోంద‌ని, ఏ క్ష‌ణ‌మైనా భారీ వ‌ర‌ద ముంచెత్తే ప్ర‌మాదం ఉన్న‌ట్లు చైనా చెబుతోంది. దీంతో టిబెట్‌లో రెస్క్యూ ఆప‌రేష‌న్ నిలిపివేశారు. రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో నిమగ్న‌మైన పోలీసులు, స‌హాయ‌క బృందాలు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాలంటూ నేపాలీ పోలీసులు సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌ట‌న చేశారు.