Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తుపాకులు పట్టుకుని తిరిగిన చేతులు.. నేడు మెరిసే పూసలతో రాఖీలను అల్లుతున్నాయి.

    Author VENKATESH | 28 Aug 2026, 01:15 PM | INTERNATIONAL
     తుపాకులు పట్టుకుని తిరిగిన చేతులు..  నేడు మెరిసే పూసలతో రాఖీలను అల్లుతున్నాయి.

    ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రం లొంగిపోయిన మావోయిస్టులకు కొత్త జీవితాన్ని చూపుతోంది. వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్న ఈ కేంద్రంలో రక్షాబంధన్‌ సందర్భంగా ప్రత్యేకంగా రాఖీల తయారీ చేపట్టారు. వెయ్యికి పైగా రాఖీలను ఎంతో అందంగా రూపొందించారు. రంగురంగుల దారాలు, పూసలు, ఆకర్షణీయమైన అలంకరణలతో రూపొందించిన ఈ రాఖీలు మార్కెట్లోకి విస్తృతంగా అమ్ముడుపోయాయి. దీంతో తమ శ్రమకు తగిన ఫలితం దక్కుతోందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాంకేర్‌ జిల్లా చౌగేల్‌ గ్రామంలోని పునరావాస కేంద్రం కేవలం శిక్షణ కేంద్రంగానే కాకుండా.. లొంగిపోయిన మావోలకు కొత్త జీవన మార్గాన్ని చూపించే వేదికగా నిలుస్తోంది. రాఖీల తయారీతో పాటు వివిధ వృత్తుల్లో వారికి శిక్షణ ఇస్తున్నారు. గతంలో హోలీ సందర్భంగా గులాల్‌ను కూడా వీరితోనే తయారు చేయించారు. ఈ సందర్భంగా అక్కడి ఏఎస్పీ ఆకాశ్ శ్రీశ్రీమాల్ మాట్లాడుతూ.. 'వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నాం. రాఖీల తయారీ సహా ఈ ఏడాది హోలీ సందర్భంగా గులాల్‌ కూడా తయారు చేయించారు' అని అన్నారు.