Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు..

    Author VENKATESH | 31 Aug 2026, 04:32 PM | Politics
    రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు..

    తెలంగాణలో ప్రజలకు మేలు చేసే ఒక బలమైన రాజకీయ వేదికను పునర్నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నానని వెల్లడించారు. అందులో భాగంగానే గత కొన్ని నెలలుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిర్భయంగా ఖండిస్తున్నానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమ పంథానే తనకు ఆదర్శమని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. గత వైఎస్సార్ స్వర్ణయుగాన్ని మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా త్వరలోనే ఒక సంచలన నిర్ణయంతో కూడిన ప్రజా రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ లో సంక్షేమ వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, విద్యా రంగాని కి ఎంతో కీలకమైన ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించలేని దయనీయ మైన పరిస్థితి నెలకొందని విమర్శించారు. రాజకీయాన్ని కేవలం వ్యాపారంగా మార్చుకుని, పైసలు సంపాదించడమే ధ్యేయంగా వచ్చిన వాళ్లు రాజకీయాల్లో శాశ్వతంగా నిలబడలేరని చెప్పుకొచ్చారు. తెలంగాణ శాసనమండలిలో అనూహ్య పరిణామం: ఎకాఎకిన ఎమ్మెల్సీపై వేటు వేసిన పార్టీ రైతు బంధు లాంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఒక చేతితో రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్న ట్లు నటిస్తూనే, మరో చేతితో గల్లీ గల్లీలో ఉన్న బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు పెంచి ఆ డబ్బును ప్రజల నుంచి దారుణంగా గుంజుకుంటోందని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వైఎస్సార్ టీం అంటారని... ఈ రోజు తాము ఈ స్థాయిలో ఉన్నామంటే రాజశేఖర రెడ్డే కారణమని.. తాము ఎప్పటికీ అభిమానంతోనే ఉంటామని.. తమ కుటుంబ సభ్యుడిలా అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. దీంతో.. అసలు రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా ఏం చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.