Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • లండన్‌ పర్యటనకు సీఎం విజయ్‌.. భార్య సంగీతను కలుస్తారా?

    Author VENKATESH | 04 Sep 2026, 02:08 PM | Cinema
    లండన్‌ పర్యటనకు సీఎం విజయ్‌.. భార్య సంగీతను కలుస్తారా?

    తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు సీఎం విజయ్. రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆయన ఈ నెల 10న బ్రిటన్‌కు పయనం కానున్నారు. సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు యూకేలో జరిగే పలు పారిశ్రామికవేత్తల సమావేశాల్లో ఆయన హై-లెవెల్ చర్చలు జరపనున్నారు. అయితే, ఈ అధికారిక పర్యటన రాజకీయ వర్గాలతో పాటు సినీ సర్కల్స్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కొంతకాలంగా సీఎం విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన సతీమణి సంగీత విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆమె ఆ కేసును వెనక్కి తీసుకోవడం లాంటి పరిణామాలు తమిళనాట హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయాయని, త్వరలోనే వారు మళ్లీ ఒక్కటవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో లండన్‌లో ఉంటున్న భార్య సంగీత, కుమార్తె దివ్యను విజయ్ ఈ టూర్‌లో కలవనున్నారనే ఊహాగానాలు ప్ర‌స్తుతం ఊపందుకున్నాయి