Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కేసీఆర్‌కు ప్రాణహాని కలిగించే కుట్రలపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

    Author VENKATESH | 09 Sep 2026, 07:25 PM | ఖమ్మం
    కేసీఆర్‌కు ప్రాణహాని కలిగించే కుట్రలపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

    తెలంగాణ జాతిపిత, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రాణహాని కలిగించే కుట్రపై బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం బూర్గంపహాడ్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌కు భౌతికంగా కీడు జరగాలని కోరుకోవడం నేరపూరిత చర్య అన్నారు. పార్టీపరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ నేరాన్ని ప్రోత్సహించేలా షాద్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కేసీఆర్ చావు కోరుతూ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా నేరాన్ని ప్రోత్సహిస్తున్న వారిని క్షమించవద్దని, చట్టపరంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జవాబు చెప్పలేక బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్నారని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావుకోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ తో పాటు నేరాన్ని ప్రోత్సహించిన రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలన్నారు.రాజకీయ వార్తలు చదవండి