Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వినాయక చవితి స్పెషల్.. పెసరపప్పు పాయసం!

    Author VENKATESH | 12 Sep 2026, 08:40 PM | Bhakti, HEALTH
    వినాయక చవితి స్పెషల్.. పెసరపప్పు పాయసం!

    వినాయక చవితి పండుగకు అందరూ రెడీ అవుతున్నారు. వాడవాడలా గణనాధుడు మండపాలలో పూజలు అందుకోనున్నారు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పాల తాలికలు, ఉండ్రాళ్ళ పాశం ఇలా ఎన్నో నైవేద్యాలు ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా గణపతికి ఇష్టమైన పాయసం తయారీ తెలుసుకుందాం. పెసరపప్పు, బియ్యం, బెల్లం పాలతో తయారు చేసే ఈ పాయసం చాలా స్పెషల్.
    తయారీ విధానం:
    ముందు పెసరపప్పు, బియ్యం కలిపి బాగా కడగండి. 20-30 నిమిషాలు నానబెట్టండి. ఆపై ప్రెషర్ కుక్కర్‌లో నానబెట్టిన పెసరపప్పు, బియ్యం, 1½ కప్పు నీళ్లు పోసి 4-5 విజిల్స్ వచ్చేలా ఉడికించండి. బాగా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత తీసి మెత్తగా దానిని మాష్ చేసుకోవాలి. ఆపై ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి వేపి పక్కన పెట్టండి. ఇలా చేస్తే పెసరపప్పుతో చేసిన పాయసానికి రుచి అదే నెయ్యిలో ఉడికించి మెత్తగా చేసుకున్న పెసరపప్పు-బియ్యం మిశ్రమం వేసి 3-4 నిమిషాలు మళ్ళీ ఉడికించాలి. ఆపై అందులో పాలు పోసి బాగా కలిపి ఉడికించండి. అందులోనే బెల్లం తురుమి వేసి కరిగే వరకు కలుపుతూ ఉడికించండి. పాయసం కావాల్సిన చిక్కదనం వచ్చే వరకు 8 నుండి10 నిమిషాలు ఉడికించండి. చివరగా ఏలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపండి.