Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అభిమానికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన సోనూ సూద్!

    Author VENKATESH | 21 Sep 2026, 11:19 AM | Cinema
    అభిమానికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన సోనూ సూద్!

    ఆపదలో ఉన్నవారికి ఎల్లప్పుడూ ముందుండి సాయం చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. విజయవాడ నగరంలో తనపై ఉన్న అంతులేని అభిమానంతో ఓ యువకుడు తన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు సోనూ సూద్ పేరు పెట్టుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా సోనూ సూద్ దృష్టికి వెళ్లడంతో, ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు.అత‌డి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి ఆ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను సందర్శించి అభిమానికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. తనని స్వయంగా చూడటంతో ఆ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ యజమాని మరియు అభిమాని ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. సోనూ సూద్ అక్కడికి వచ్చి కాసేపు ముచ్చటించి, ఫాస్ట్‌ఫుడ్ రుచి చూస్తూ ఫోటోలు దిగారు. ఈ అరుదైన దృశ్యాలను చూసేందుకు స్థానికులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. రియల్ హీరో ఎలాంటి గర్వం లేకుండా సామాన్య అభిమాని వద్దకు వెళ్లి కలిసిన తీరు చూసి నెటిజన్లు, ప్రజలు సోనూ సూద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.