Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు..

    Author VENKATESH | 21 Sep 2026, 12:06 PM | INTERNATIONAL
    అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు..

    అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపింది. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున అఫ్ఘాన్‌లోని కునార్, పక్తికా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధవిమానాలతో పాక్ బాంబుల వర్షం కురిపించింది. పక్తికాలోని రెండు ప్రాంతాల్లో పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహించింది. ఇక్కడ ఆస్తి నష్టం వాటిల్లిన్నప్పటికీ ప్రాణనష్టం జరగలేదు. అయితే కునార్‌లో జరిపిన దాడుల్లో మాత్రం ముగ్గురు మృత్యువాతపడ్డారు. అలాగే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
    కాగా అఫ్గాన్, పాక్ సరిహద్దు ప్రాంత ప్రజలను ఈ దాడులు ఆందోళనలోకి నెట్టేశాయి. ఈ రెండు దేశాల మధ్య కొంత కాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ దాడులు చేసింది.ఈ దాడుల కారణంగా అమాయక పౌరులు మరణిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్నివేదిక ప్రకారం ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు సరిహద్దు హింసలో 57 మంది మరిణించగా, 342 మంది గాయపడ్డారు. వైమానిక దాడుల కారణంగానే పౌరులు మృతి చెందుతున్నారని ఆ నివేదిక తెలిపింది. పక్తికా, కునార్ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఎయిర్‌స్ట్రైక్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని వివరించింది.