Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ మాస్ జోష్..

    Author VENKATESH | 22 Sep 2026, 11:14 AM | Cinema
    ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ మాస్ జోష్..

    నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో సోమవారం రాత్రి ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. నాని, శ్రీకాంత్ ఓదెలతో పాటు పలువురు చిత్రబృంద సభ్యులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం బాలీవుడ్ నటుడు, డ్యాన్స్ కళాకారుడు రాఘవ్ జుయల్. ‘ది ప్యారడైజ్’లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్న రాఘవ్ జుయల్.. ప్రీ రిలీజ్ వేడుకలో తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు. వేదికపైకి వచ్చిన వెంటనే తన ప్రత్యేకమైన స్లో మోషన్ డ్యాన్స్‌తో సందడి చేశాడు.
    ఈ కార్యక్రమంలో ‘ది ప్యారడైజ్’లోని ‘ఆయా షేర్’ పాటకు రాఘవ్ జుయల్ తనదైన శైలిలో డ్యాన్స్ చేశాడు. ముఖ్యంగా అతని స్లో మోషన్ స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాఘవ్ డ్యాన్స్ చేస్తుంటే అభిమానులు కేరింతలతో సందడి చేశారు. అంతటితో ఆగకుండా యాంకర్ సుమతో కలిసి ‘ఏషనాగుల కట్ట మీద’ పాటకు కూడా రాఘవ్ జుయల్ డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో రాఘవ్ జుయల్ చేసిన డ్యాన్స్ ప్రదర్శనకు సంబంధించిన దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగు ప్రేక్షకులకు రాఘవ్ జుయల్ పెద్దగా పరిచయం లేకపోయినా.. హిందీ ప్రేక్షకులకు మాత్రం ఆయన సుపరిచితమే. అద్భుతమైన డ్యాన్సర్‌గా, వ్యాఖ్యాతగా, నటుడిగా రాఘవ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
    2009లో ప్రసారమైన ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ మొదటి సీజన్ ద్వారా రాఘవ్ జుయల్ వెలుగులోకి వచ్చాడు. ప్రత్యేకమైన శైలిలో డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా నెమ్మదిగా చేసే డ్యాన్స్ కదలికలను తనదైన శైలిలో ప్రదర్శిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. డ్యాన్స్‌తో పేరు తెచ్చుకున్న రాఘవ్ జుయల్ ఆ తర్వాత నటుడిగానూ తన కెరీర్‌ను కొనసాగించాడు. 2014లో విడుదలైన ‘సోనాలి కేబుల్’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు