Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అమెరికా అలా చేస్తే వారం రోజుల్లో హార్ముజ్ జ‌ల‌సంధిని తెరుస్తాం..

    Author VENKATESH | 22 Sep 2026, 09:24 PM | INTERNATIONAL
    అమెరికా అలా చేస్తే వారం రోజుల్లో హార్ముజ్ జ‌ల‌సంధిని తెరుస్తాం..

    హార్ముజ్ జ‌ల‌సంధిని తెరిచే విష‌యంలో ఇరాన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ జ‌ల‌సంధిలో దిగ్బంధ‌నాన్ని అమెరికా తొల‌గిస్తే, అలాగే, సైనిక మోహ‌రింపుల‌ను త‌గ్గిస్తే వారం రోజుల్లో జ‌ల‌సంధిని తెరుస్తామ‌ని ఇరాన్ ప్ర‌క‌టించింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభ‌మై దాదాపు ఏడు నెల‌లు కావ‌స్తోంది. ఇంత‌కాలం హార్ముజ్ జ‌ల‌సంధి పూర్తిస్తాయిలో తెరుచుకోలేదు. మ‌ధ్య‌లో కొంత‌కాలం తెరుచుకున్నా ఆ వెంట‌నే మ‌ళ్లీ జ‌ల‌సంధిని ఇటు ఇరాన్.. అటు అమెరికా దిగ్బంధించాయి.దీంతో హార్ముజ్ నుంచి నౌక‌ల ర‌వాణా అతిక‌ష్టంగా మారింది. ప్ర‌పంచ వాణిజ్యంలో, చ‌మురు ర‌వాణాలో కీల‌క‌మైన హార్ముజ్‌ను తెర‌వాలని ప్ర‌పంచ దేశాలు కోరుతున్నాయి. హార్ముజ్ మూసి ఉంచ‌డం వ‌ల్ల ఇరాన్‌తోపాటు అమెరికాకు కూడా ఆర్థికంగా భారంగానే మారింది. దీంతో రెండు దేశాల మీద ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇరాన్ చేసిన ప్ర‌క‌ట‌న ఆస‌క్తి క‌లిగిస్తోంది. ఇరాన్ అధ్య‌క్షుడు పెజెష్కియాన్ అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్నారు. న్యూయార్క్‌లో జ‌రిగే ఐక్య‌రాజ్య‌స‌మితి సమావేశానికి ఆయ‌న హాజ‌రుకానున్నారు.ఈ సంద‌ర్భంగా ఇరాన్-అమెరికా ముగింపున‌కు మ‌ధ్య‌వ‌ర్తిత్వం వహించే అంశంపై వివిధ దేశాల ప్ర‌తినిధుల‌తో పెజెష్కియాన్ చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం ఉంది. హార్ముజ్ జ‌ల‌సంధి తెరిచే అంశానికి సంబంధించి అమెరికా త‌న సైనిక మోహ‌రింపును మిడిల్ ఈస్ట్ నుంచి త‌గ్గించాలి. ఇదే స‌మ‌యంలో జ‌ల‌సంధిని దిగ్బంధించిన అమెరికా.. వెన‌క్కు వెళ్లిపోవాలి. ఇది జ‌రిగితే వారం రోజుల్లోగా హార్ముజ్‌ను తెరుస్తామ‌ని ఇరాన్ ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ ఆర్థిక ప్ర‌గ‌తికి హార్ముజ్ జ‌ల‌సంధి నౌకా ర‌వాణా మార్గం చాలా కీల‌కం.