Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అమెరికా ఆంక్షలకు సహకరిస్తే మీ విమానాశ్రయాలు పనిచేయవు..

    Author VENKATESH | 24 Sep 2026, 12:51 PM | INTERNATIONAL
    అమెరికా ఆంక్షలకు సహకరిస్తే మీ విమానాశ్రయాలు పనిచేయవు..

    అమెరికా విధించిన కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. తమ విమానాలను నిలిపివేసేందుకు అమెరికాతో కలిసి పనిచేసే పొరుగు దేశాల విమానాశ్రయాలు కూడా పనిచేయకుండా చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ ఈ హెచ్చరిక చేశారు. ఇరాన్ విమానయాన రంగంపై అమెరికా కొత్త ఆంక్షలను అమలు చేయడం ప్రారంభించింది.ఇరాన్ విమానయాన సంస్థలకు ఇంధనం, ల్యాండింగ్ సేవలు, టికెట్ విక్రయాలు వంటి సేవలు అందించే సంస్థలపై కూడా అమెరికా ద్వితీయ ఆంక్షలు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ హెచ్చరించారు. దీంతో ఇరాన్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభావం పడుతోంది. అమెరికా ఆంక్షల ప్రభావంతో ఇరాన్‌కు చెందిన కొన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇప్పటికే నిలిచిపోయాయి. ఇరాన్ విమానాలపై ఆంక్షలు అమలు చేస్తున్నట్లు జార్జియా, అజర్‌బైజాన్ ప్రకటించాయి. ఇరాక్‌లోని బాగ్దాద్, ఒమన్‌లోని మస్కట్‌కు వెళ్లే కొన్ని ఇరాన్ విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి .అమెరికా ఆంక్షలను అమలు చేస్తున్న పొరుగు దేశాలను ఉద్దేశించి ఇరాన్ సీనియర్ భద్రతా అధికారి మొహ్సెన్ రెజాయీ తీవ్ర హెచ్చరిక చేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఇరాన్ విమానాలను తమ విమానాశ్రయాల్లోకి అనుమతించకపోతే.. ఆయా దేశాల విమానాశ్రయాలకు కూడా విమాన సర్వీసులు లేకుండా చేస్తామని ఆయన అన్నారు. ప్రాంతీయ దేశాలు అమెరికా చర్యల్లో భాగస్వాములు కావొద్దని సూచించారు.