Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సిద్దిపేట జిల్లాలో పిచ్చి కుక్క వీరంగం..

    Author VENKATESH | 25 Sep 2026, 01:24 PM | సిద్దిపేట
    సిద్దిపేట జిల్లాలో పిచ్చి కుక్క వీరంగం..

    సిద్దిపేట శివారు పొన్నాలలో గణేశ్ నిమజ్జనంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఒక్కసారిగా విరుచుకుపడి మొత్తం 13 మందిని తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామస్థులంతా ఆనందోత్సాహాల మధ్య వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.ఇదే సమయంలో ఓ పిచ్చికుక్క వారి వద్దకు వచ్చింది. డ్యాన్సులు చేస్తున్న వారిని చూస్తున్న స్థానికులపై ఒక్కసారిగా దాడికి తెగబడింది. 8 మందిని తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం మరోచోట వినాయక మండపాల వద్ద ఆడుకుంటున్న చిన్నారులపై దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కనకవ్వ అనే మహిళను వెంటాడి మరీ కరిచింది. శునకం దాడిలో మొత్తం 13 మంది గాయపడగా.. బాధితులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.