Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మైనారిటీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా సంక్షేమాధికారి

    Author VENKATESH | 25 Sep 2026, 08:33 PM | ఖమ్మం
    మైనారిటీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా సంక్షేమాధికారి

    ఖమ్మం జిల్లా కారేపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల , కళాశాలను ఖమ్మం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులంలోని హాస్టల్, స్టాక్ రిజిస్టర్, ఆహార పట్టిక, ఆహార పదార్థాలు,తరగతి గదులు, మూత్రశాలలు,డార్మెటరీలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
    అనంతరం విద్యార్థులతో మాట్లాడారు.
    విద్యార్థులు తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు లక్ష్యాలను నిర్దేశించు కుని, క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. నిరంతర కృషి ,పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, వసతి ఏర్పాట్లపై సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో విద్యార్థులకు మెరుగైన వసతులు,నాణ్యమైన విద్య అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట గురుకుల ప్రిన్సిపల్ సావిత్రి, ఉపాధ్యాయులు,వార్డెన్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.