Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దొండకాయలు తినవచ్చా? అపోహలు ఏంటీ?

    Author VENKATESH | 26 Sep 2026, 04:40 PM | HEALTH
    దొండకాయలు తినవచ్చా? అపోహలు ఏంటీ?

    దొండకాయ గురించి తెలియని వారు ఉండరు. నిత్యం మన ఇళ్లలో చేసుకునే కూరల్లో దొండకాయ వేపుడు, దొండకాయ పచ్చడి వంటి వంటకాలు సర్వసాధారణం. దొండకాయను ఎక్కువగా తింటే మతిమరుపు వస్తుందని చెబుతుంటారు. చాలాకాలంగా ఇది ప్రచారంలో ఉంటూ వస్తోంది. ప్రత్యేకించి.. చిన్నపిల్లలు దీన్ని ఎక్కువగా తింటే చదువు బుర్రకు ఎక్కదనే అభిప్రాయం నాటుకుపోయింది. ఈ ఉద్దేశంతో చాలామంది దీన్ని దూరం పెడుతుంటారు.ఈ ప్రచారంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఇందులో ఉండే పోషకాలు శరీరానికి కొండంత బలాన్ని ఇస్తాయి. దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందనే వాదన ఉంది. దొండకాయలో నీటి శాతం, పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. విటమిన్ ఏ, విటమిన్ సీ వంటి ముఖ్యమైన విటమిన్లతో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడతాయి. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. Also Read చంద్రుడిపై ఒక రాత్రి గడవాలంటే 14 రోజులు: సోలార్ టవర్ కు ప్లాన్..!! మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి దొండకాయ ఓ ఔషధంగా పనిచేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని సంరక్షించడం, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను సులభంగా బయటకు పంపడంలో ఈ పీచు పదార్థం కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి దొండకాయ ఎంతో దోహదపడుతుంది. దీనిపై జరిగిన పలు పరిశోధనల ప్రకారం దొండకాయలోని సహజ సమ్మేళనాలు శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయని తేలింది. రేపటి నుంచి టీమిండియా వన్డేల జాతర.. !! పేగుల్లో గ్లూకోజ్ గ్రహింపును తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తాయి. బరువు నియంత్రణలో కూడా దొండకాయ పాత్ర అమోఘం. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు తమ రోజువారీ డైట్‌లో దొండకాయను చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. తక్కువ కేలరీలు ఉండటం వల్ల శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్ ఇచ్చినప్పుడు భారత రాయబారి రియాక్షన్ ఏదైతే ఉందో.. !! లివర్ ను సంరక్షించడంలో దొండకాయ సహాయపడుతుంది. ఇందులో ఉండే హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలు కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ లేదా విష పదార్థాలను తొలగించి, కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. దొండకాయలో లభించే బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేయడమే కాకుండా కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తాయి.