Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • యాసిడ్ రిఫ్ల‌క్స్ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు నిపుణులు సూచించిన నాచురల్ టిప్స్ ఇవిగో..

    Author VENKATESH | 28 Sep 2026, 10:57 AM | HEALTH
    యాసిడ్ రిఫ్ల‌క్స్ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు నిపుణులు సూచించిన నాచురల్ టిప్స్ ఇవిగో..

    యాసిడ్ రిఫ్లక్స్‌ సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. పొట్ట‌లోని ఆమ్లం తిరిగి నోటి నుంచి జీర్ణాశ‌యానికి ఆహారం చేరే గొట్టమైన అన్నవాహికలోకి ప్రవహించినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్‌ ఏర్పడుతుంది. దీనివల్ల ఛాతీలో మంట, అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య తరచూ కొనసాగితే అన్నవాహికపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, పదేపదే వచ్చే లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఆహార పదార్థాలు, జీవనశైలి వంటి అంశాలు కొంతమందిలో యాసిడ్ రిఫ్లక్స్‌ను ప్రేరేపిస్తాయి.
    చూయింగ్ గ‌మ్‌..
    యాసిడ్ రిఫ్లక్స్‌ను నియంత్రించుకోవడానికి భోజనం తర్వాత పుదీనా లేని చక్కెర రహిత చూయింగ్‌గమ్‌ను నమలడం ఒక మార్గంగా సూచిస్తున్నారు. చూయింగ్‌గమ్‌ నమలడం వల్ల తరచూ మింగడం జరుగుతుంది. దీంతో అన్నవాహికలోని ఆమ్లం త్వరగా కిందికి వెళ్లేందుకు సహాయపడుతుంది. అయితే పుదీనా కలిగిన చూయింగ్‌గమ్‌ను నివారించాలని సూచిస్తున్నారు. అలాగే భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు నడవడం, ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత నడవడం కూడా రిఫ్లక్స్‌ సమస్యను తగ్గించడంలో సహాయపడ‌తాయి. ఆహారంలో శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లు, చక్కెరను తగ్గించుకోవడంపైనా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
    ప‌డుకునే విధానంలో మార్పులు..
    రాత్రివేళ యాసిడ్ రిఫ్లక్స్‌ సమస్యను తగ్గించుకోవడానికి పడుకునే విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. మంచం తల భాగాన్ని సుమారు 6 నుంచి 8 ఇంచుల వరకు ఎత్తుగా ఉంచడం వల్ల రాత్రి సమయంలో అన్నవాహికపై ఆమ్లం ప్రభావం పడే సమయం తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అలాగే పడుకునే సమయానికి 2 నుంచి 3 గంటల ముందే భోజనం ముగించాలి. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల రాత్రి సమయంలో ఆమ్లం అన్నవాహికపై ఎక్కువసేపు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
    ఎడ‌మ వైపు తిరిగి నిద్రిస్తే..
    నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం కూడా యాసిడ్ రిఫ్లక్స్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే మరో మార్గంగా సూచిస్తున్నారు.