Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచ‌కం’ నెట్‌ఫిక్స్‌లో..

    Author VENKATESH | 28 Sep 2026, 11:01 AM | Cinema
     సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచ‌కం’ నెట్‌ఫిక్స్‌లో..

    యువతను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘రోమాంచ‌కం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయినప్పటికీ.. ఇప్పుడు డిజిటల్ వేదికపై కొత్త ప్రేక్షకులను అల‌రించేందుకు సిద్ధ‌మైంది.. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ఈ సినిమాలో ప్రధాన జంటగా నటించారు. యువతకు సంబంధించిన ప్రేమ, వినోదం, సంబంధాల చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కొత్త సినిమాలు చూడండి
    తాజాగా ‘రోమాంచ‌కం’ ఓటీటీ విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 1, 2026 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన తర్వాత డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఓటీటీ ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉంది. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘రోమాంచ‌కం’ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ప్రేక్షకుల పరిధిని దాటి ఇతర ప్రాంతాల్లోనూ ఈ సినిమాను చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ప్రేమకథ, కామెడీ అంశాలు ఇతర భాషల ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.థియేటర్లలో ‘రోమాంచ‌కం’కు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే టాక్ వినిపించింది. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే థియేటర్లలో ఫలితం ఎలా ఉన్నా.. ఓటీటీకి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలకు కొత్త ప్రేక్షకులు దొరుకుతుంటారు. ముఖ్యంగా ఇంట్లోనే సులభంగా చూసే అవకాశం ఉండటంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో సినిమాను చూసే అవకాశం ఉంటుంది.