Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్టాక్ మార్కెట్ క్రాష్.. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి

    Author VENKATESH | 28 Sep 2026, 11:38 AM | BUSINESS
    స్టాక్ మార్కెట్ క్రాష్.. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి

    పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరుగుతున్న ముడి చమురు ధరల దెబ్బకు దేశీ స్టాక్ మార్కెట్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే రూ.6 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ముడిచమురు ధరలు పెరగడంతో పాటు విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో, ఆర్థిక రంగ సంస్థల షేర్లు పతనం కావడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర పతనం కాగా, నిఫ్టీ 22,850 దిగువకు చేరింది. షేర్ల పతనానికి ప్రధాన కారణాలు ఏవంటే..
    ముడి చమురు ధరల ప్రభావం..
    నేడు మార్కెట్లో అమ్మకాలు పోటెత్తడానికి ప్రధాన కారణం ముడి చమురు ధరల పెరగడమేనని పరిశీలకులు చెబుతున్నారు. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 2.20 శాతం మేర పెరిగి 106 డాలర్ల మార్కును దాటింది. ఇరాన్, అమెరికా చర్చల్లో పురోగతి లేకపోవడంతో ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు నెలకొన్నాయి. ఇది రూపాయి మారకం విలువపైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతిమంగా ఇవన్నీ కంపెనీల లాభదాయకతను దెబ్బతీస్తాయి. ముడి చమురు ధరల పెరుగుదలతో పాటు అంతర్జాతీయంగా బాండ్స్‌పై రాబడులు పెరగడం కూడా స్టాక్ మార్కెట్స్‌ నుంచి సంపద తరలిపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
    ఫైనాన్షియల్ రంగ సంస్థల షేర్ల పతనం
    సోమవారం ఫైనాన్షియల్ రంగ సంస్థల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బజాజ్ ఫైనాన్స్ సంస్థ షేరు 1.59 శాతం మేర, కోటక్ మహీంద్రా బ్యాంకు షేరు 1.38 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు 1.37 శాతం మేర పతనమయ్యాయి. ఇన్సురెన్స్ కాంపన్సేషన్ వ్యవస్థకు ఐఆర్‌డీఏ ఇటీవల కొన్ని మార్పులు ప్రతిపాదించడంతో ఈ రంగంలో అమ్మకాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంతో ముడిపడ్డ కంపెనీల రాబడులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం కనిపించిన అమ్మకాల వెల్లువ ఈ వారం కూడా కొనసాగుతోంది.
    తరలిపోతున్న విదేశీ పెట్టుబడిదార్ల నిధులు
    విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ పతనం అవుతున్నాయి. యూఎస్ బాండ్స్‌పై రాబడులు పెరగడంతో పాటు ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికవ్యవస్థలు నెమ్మదించవచ్చన్న అంచనాతో ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు