Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోర్చుగల్‌కు నా అసవరం లేదా?.. అయితే వీడ్కోలు పలుకుతా..!

    Author VENKATESH | 28 Sep 2026, 07:58 PM | Sports
    పోర్చుగల్‌కు నా అసవరం లేదా?.. అయితే వీడ్కోలు పలుకుతా..!

    అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో లియోనల్ మెస్సీవీడ్కోలుతో ఇప్పుడు అందరి కళ్లు క్రిస్టియానో రొనాల్డోమీదే ఉన్నాయి. కోట్లాది మంది అభిమానగణమున్న ఈ ఫార్వార్డ్ ప్లేయర్ మరికొన్ని రోజులు ఆటత అలరిస్తాడనుకుంటే వీడ్కోలు పలికేలా ఉన్నాడు. ఈమధ్య భావోద్వేగానికి లోనైన రొనాల్డో స్వయంగా తన రిటైర్మెంట్‌ టైం వచ్చేసిందిని అన్నాడు. సొంతదేశం తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అతడు.. తనను బెంచ్ మీద కూర్చోబెట్టడంపై విచారం వ్యక్తం చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇలాగైతే తాను కూడా మెస్సీని అనుసరిస్తూ వీడ్కోలు పలుకుతానేమో అని పేర్కొన్నాడీ వెటరన్.
    సాకర్ ప్రపంచంలో తన ఆటతో కోట్లాదిమందిని మంత్రముగ్దులను చేసిన క్రిస్టియానో రొనాల్డో కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. వరల్డ్‌కప్ అనంతరం నెయ్‌మర్, లియోనల్ మెస్సీలు వీడ్కోలు పలకగా.. తదుపరి వికెట్ రొనాల్డోనే అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతడే స్వయంతో వీడ్కోలుపై స్పందించాడు. నార్వేతో మ్యాచ్‌లో బెంచ్ మీద కూర్చోబెట్టడంపై చిన్నబుచ్చుకున్న రొనాల్డో ఇక రిటైర్మెంట్ సమయం వచ్చేసిందని అభిప్రాయపడ్డాడు.
    ‘పోర్చుగల్ మ్యాచ్‌లో బెంచ్‌పై కూర్చోబెట్టడం నన్ను చాలా బాధిస్తోంది. జట్టకోసం సర్వం ధారపోసిన నేను.. మేనేజ్‌మెంట్‌కు నాపై నమ్మకం లేని రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇంతకుముందులా వారు నన్ను చూడడం లేదు. అయితే.. దేశం తరఫున నేను కలగన్న ప్రతిదీ సాధించాను. పోర్చుగల్‌ జట్టుకు నా అవసరం లేనప్పుడు.. నా అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు వచ్చేసిందని నేను అంగీకరిస్తున్నా. ఇలా బెంచ్‌ మీద ఉండడం కంటే వీడ్కోలు పలకడమే సరైన నిర్ణయం అనిపిస్తోంది’ అని రొనాల్డో ఉద్వేగభరింతగా వెల్లడించాడు.