Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రోడ్ల పునరుద్ధరణకు రూ.1,498.30 కోట్ల వ్యయం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    Author VENKATESH | 28 Sep 2026, 08:14 PM | ANDHRA PRADESH
    రోడ్ల పునరుద్ధరణకు రూ.1,498.30 కోట్ల వ్యయం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తీవ్ర వాయుగుండం కారణంగా దెబ్బతిన్న రహదారులను త్వరలోనే పునరుద్ధరిస్తామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో అనునిత్యం సమీక్షలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేయగలిగామని ఆయన వెల్లడించారు.
    తీవ్ర వాయుగుండంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,405 కి.మీ. మేర ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి జనార్దన్ తెలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 412 కి.మీ. మేర రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా 36 చోట్ల రహదారులు కోతకు గురి కాగా.. 9 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయన్నారు. దీంతో వాటిని పునరుద్ధరించామని చెప్పారు. 187 చోట్ల సీడీ వర్క్స్ దెబ్బతినగా.. 169 చోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు. 254 చోట్ల రహదారులకు అడ్డంగా చెట్లు పడిపోగా.. వాటిని పూర్తిగా తొలగించి ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చేయగలిగామని తెలిపారు. వర్షం కారణంగా 103 చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే, రద్దీని క్లియర్ చేయగలిగామని వెల్లడించారు.వర్షం కారణంగా దెబ్బతిన్న రహదారులు తాత్కాలిక మరమ్మతులకు దాదాపు రూ.162.09 కోట్లు, శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరణకు రూ.1336.83 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి అంచనా వేశారు.