Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సాగరహారానికి 14 ఏళ్లు.. తెలంగాణ ఉద్యమకారులకు కేటీఆర్‌ ఉద్యమాభివందనాలు

    Author VENKATESH | 30 Sep 2026, 12:01 PM | TELANGANA
     సాగరహారానికి 14 ఏళ్లు.. తెలంగాణ ఉద్యమకారులకు కేటీఆర్‌ ఉద్యమాభివందనాలు

    తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన ‘సాగరహారం’ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తుచేసుకున్నారు. 2012 సెప్టెంబర్‌ 30న సబ్బండ వర్గాలు హుస్సేన్ సాగర్ తీరాన నిర్వహించిన సాగరహారం కార్యక్రమానికి 14 ఏళ్లు పూర్తైన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణవాదులకు ఆయన ఉద్యమాభివందనాలు తెలిపారు.ఈ మేరకు కేటీఆర్‌ బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాట రూపమే సాగరహారం అని పేర్కొన్నారు. ఆంక్షలు, నిర్బంధాలు, ముళ్లకంచెలు, లాఠీచార్జీలు, రబ్బర్‌ బుల్లెట్లను లెక్కచేయకుండా ఉద్యమకారులు, తెలంగాణవాదులు కార్యక్రమాన్ని నిర్వహించారని ఆయన పేర్కొన్నారు.