Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అర్ధరాత్రి అదుపుతప్పిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు..

    Author VENKATESH | 30 Sep 2026, 12:21 PM | TELANGANA
    అర్ధరాత్రి అదుపుతప్పిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు..

    సూర్యాపేట జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోతే మండలం హుస్సేనాబాద్‌ సమీపంలో ట్రావెల్స్‌ బస్సు (NL 01 B 5579) అదుపుతప్పి బోల్తాపడింది. హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు బోల్తాపడటంతో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
    నిద్రమత్తే కారణమా?
    హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ నిద్రమత్తు, నిర్లక్ష్యం కారణంగానే బస్సు అదుపుతప్పినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.