Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పగిడేరులో బీఆర్‌ఎస్‌ యువజన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..

    Author VENKATESH | 30 Sep 2026, 12:38 PM | ఖమ్మం
    పగిడేరులో బీఆర్‌ఎస్‌ యువజన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామ బీఆర్‌ఎస్‌ యువజన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు గ్రామ పార్టీ నాయకులు, యువజన నాయకుల సమక్షంలో సమావేశం నిర్వహించి నూతన కమిటీని ప్రకటించారు.కమిటీ యువజన అధ్యక్షుడిగా పూనెం రాము, ఉపాధ్యక్షులుగా ఎలగందుల ప్రశాంత్, ఎస్‌కే షరీఫ్, ప్రధాన కార్యదర్శిగా చందా పుల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి, యువతను సంఘటితం చేసేందుకు నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు.కార్యక్రమంలో మణుగూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు బోశెట్టి రవిప్రసాద్, జిల్లా యువజన నాయకుడు పద్దం శ్రీనివాస్, సీనియర్‌ నాయకుడు పప్పుల ప్రసాద్, యువజన నాయకులు బేతమల్ల సుందర్, గంగరాజు, బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు.