Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నవంబరు 10 నుంచి పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు

    Author VENKATESH | 30 Sep 2026, 01:11 PM | ANDHRA PRADESH
    నవంబరు 10 నుంచి పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు

    రేణిగుంట రైల్వేస్టేషన్‌ యార్డ్‌ ఆధునీకరణ పనుల్లో భాగంగా రైలు మార్గాలను అనుసంధానం చేస్తున్న కారణంగా నవంబరు 10నుంచి డిసెంబరు 27వ తేది వరకు పలు రైళ్లను రద్దు చేస్తూ, మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే జోనల్‌ అధికారి విజయ్‌కిషన్‌ తెలిపారు. రేణిగుంట - నిశ్చింతపూర్‌ మధ్య వస్తు రవాణా చేసే నాలుగు రైళ్లను రద్దు చేశారు. రోజువారీగా రాకపోకలు సాగించే కడప - అరక్కోణం, తిరుచానూరు - అరక్కోణం, చెన్నై - తిరుచానూరు, గూడూరు - రేణిగుంట, నెల్లూరు - రేణిగుంట మధ్య రోజువారీ రాక పోకలు నిర్వహించే ప్యాసింజర్‌ రైళ్లను 48 రోజుల పాటు రద్దు చేశారు.అలాగే చెన్నై - తిరుపతి మధ్య రోజువారీగా రాకపోకలు నిర్వహించే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను 27 రోజులు రద్దు చేశారు. తిరుపతి, తిరుచానూరు, రేణిగుంట నుంచి రాకపోకలు నిర్వహించే పలు ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజులు రద్దు చేశారు. తిరుపతి - విశాఖపట్టణం మధ్య వారంలో మూడు రోజులు నడుస్తున్న డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబరు 9 నుంచి 26వ తేది వరకు ఆది, సోమ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో రద్దు చేశారు.అలాగే తిరుచానూరు నుంచి నాందేడ్‌, జాల్నా, కాచిగూడ, చర్లపల్లి మధ్య రాకపోకలు నిర్వహించే వారాంతరం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రెండు రోజులు రద్దు చేశారు. అలాగే రేణిగుంట - మైసూరు మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబరు 11, 12, 18, 19, 25, 26 తేదీల్లో రద్దు చేశారు. తిరుపతి - భువనేశ్వర్‌ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలును డిసెంబరు 12, 13, 14, 19, 20, 21, 26, 27 తేదీల్లో రద్దు చేశారు.