Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వయోవృద్ధులు పోషణ సంరక్షణ చట్టం (సీనియర్ సిటిజన్స్ చట్టం)

    Author VENKATESH | 30 Sep 2026, 09:07 PM | TELANGANA
    వయోవృద్ధులు పోషణ సంరక్షణ చట్టం (సీనియర్ సిటిజన్స్ చట్టం)

    అమలుకుప్రత్యేక అధికారిని నియమించాలి( అక్టోబర్ 1ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా)
    నేదునూరి కనకయ్య రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎకానమిక్ ఫోరం
    కొడుకుల 'బిడ్డల నిరాదరణకు గురౌతున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం 2007 లో తల్లి తండ్రుల వయోవృద్ధుల పోషణ' సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రతి డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ కమిటీ ఏర్పాటుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధుల సమస్యల పరిష్కారం' సంక్షేమం 'హక్కుల రక్షణ కొరకు నియమావళిని రూపొందించారు. కమిటీకి "ఛైర్మెన్ గా" రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి వ్యవహరిస్తారు జిల్లా వికలాంగుల సహాయ సంచాలకులు 'వయోవృద్ధులు శాఖ సహాయ సంచాలకులు కన్వీనర్లుగా స్వచ్ఛంద సంస్థల నుండి ఒకరు లేదా ఇద్దరు ప్రతినిధులు వుంటారు .ఈ కమిటీకి కోర్టుకు వుండే అధికారాలు వుంటాయి. కమిటీ తల్లి తండ్రుల కేసులు విచారించి 90 రోజుల్లో తీర్పులు ఇస్తాయి. కాని క్షేత్ర స్థాయిలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం ఆశించిన విధంగా జరగడం లేదు. రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి తన రెగ్యులర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల సమయం లేక పోవడం వల్ల వయోవృద్ధుల సమస్యలు పరిష్కారానికి నోచుకోని స్థితి. దాపురించింది. రాష్ట్రంలో వృద్ధులను బెదిరించి వారి ఆస్తులను తమ పేరు మీద రాయించుకోవడం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఒంటరి వృద్ధులు ఆస్తులు కోల్పోయి బజారున పడిన సంఘటనలు‌ చోటుచేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లు ఒంటరి మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు పథకాలు ప్రవేశ పెట్టడం అభినందనీయం కానీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరక్షరాస్యులైన వయోవృద్ధుల సంక్షేమం వారి హక్కుల రక్షణకు సమగ్రమైన చర్యలు చేపట్టాలి.
    వయోవృద్ధుల ఆస్తులు రాయించుకొని వారిని ఇంటి నుండి బైటకు గెంటి వేస్తున్నారు. వృధ్ధా శ్రమల్లో చేర్పిస్తు న్నారు. బలవంతంగా వృద్ధుల చేత ఆస్తులు రాయించుకున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆస్తి విక్రయానికి సంబంధించిన సొమ్ము వృధ్దుని ఖాతాలో జమ ఆయినా విషయం రూడి చేసుకుని అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులు నిరక్షరాస్యులు వారికి బ్యాంక్ ఖాతాలు ఉండవు. డివిజన్ స్థాయి అధికారులు తమ రెగ్యులర్ ఉద్యోగ బాధ్యతల్లో తీరిక లేకుండా వుండం వల్ల.వయోవృధ్దుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
    మండల స్థాయిలో సీనియర్ సిటిజన్స్ చట్టం అమలుకు‌ప్రత్యేక అధికారిని నియమించాలి.
    ప్రభుత్వం ప్రతి మండల స్థాయిలో వయోవృద్ధులు సమస్యలు పరిష్కారం సంక్షేమం హక్కుల రక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి.
    గ్రామసభ ' సీనియర్ సిటిజన్స్ చట్టం పట్ల అవగాహన కల్పించాలి
    గ్రామ పంచాయితీ కార్యదర్శి
    గ్రామంలోని వృదుల సంఖ్య పై సర్వే నిర్వహించాలి.
    గ్రామసభలో వయోవృద్ధుల పోషణ 'సంక్షేమం 'హక్కుల రక్షణ' సీనియర్ సిటిజన్స్ చట్టం పట్ల అవగాహన చైతన్యం కలిగించాలి.వృద్ధుల ఆరోగ్యం సంక్షేమం అభివృద్ధి పథకాల మీధచర్చ జరగాలి. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి వయోవృద్ధుల జనాభా సేకరించి ప్రతి నెల వృద్ధుల కొరకు ఉచిత విధ్య ఆరోగ్య శిబిరంనిర్వహించాలి. ప్రతి గ్రామములో మహిళా సంఘాలు 'తల్లుల కమిటీలు మాదిరి వయోవృద్ధుల కమిటీ ఏర్పాటు చేయాలి. వయోవృద్ధులు సంక్షేమం కమిటీలుగా‌ ఏర్పడాలి..
    సీనియర్ సిటిజన్స్_ చట్టాలు _మీడియా ప్రచారం చెయ్యాలి
    కేంద్రం వయోవృద్ధులు సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన టోల్ ఫ్రీ నెంబర్14567 మీధ విస్తృత ప్రచారం చెయ్యాలి .మీడియా 'ప్రసార మాధ్యమాలు 'ఎలక్ట్రానిక్ మీడియా క్రియా శీల పాత్ర పోషించాలి.కేంద్ర ప్రభుత్వం 2007 లో ప్రవేశ పెట్టిన తల్లి తండ్రుల వయోవృద్ధులు పోషణ సంక్షేమం సంరక్షణ చట్టం మీధ వృద్ధులకు అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి.
    గ్రామాల్లో వయో వృద్ధులను బెధిరించి ఆస్తిని అక్రమంగా పట్టా చేసుకున్న వారిపై 1977 చట్టాన్ని అమలు చేసి కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు జరిమానాలు విధించి తిరిగి వయోవృద్ధుల ఆస్తిని వారి పేరు మీద రిజిస్టర్ చెయ్యాలి.
    సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొనే సమస్యలు జిల్లా కలెక్టర్ రెవెన్యూ డివిజన్ అధికార్లకు నివేదించాలి. వృద్ధులను మానవ వనరుల అభివృద్ధికి సారథులుగా సమాజం ప్రభుత్వం గుర్తించాలి.
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    రచయిత కాలమిస్ట్
    గ్రామం ' కల్లెపల్లి 'మండలం' బెజ్జంకి
    జిల్లా' సిద్దిపేట 9440245771