Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్పోర్ట్స్‌ స్కూల్లో చెత్తాచెదారం.. రోగాల బారిన విద్యార్థులు, మండిపడుతున్న తల్లిదండ్రులు

    Author VENKATESH | 01 Oct 2026, 11:04 AM | హన్మకొండ
    స్పోర్ట్స్‌ స్కూల్లో చెత్తాచెదారం.. రోగాల బారిన విద్యార్థులు, మండిపడుతున్న తల్లిదండ్రులు

    కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారుల తీరు విద్యార్థులకు శాపంగా మారింది. పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనాభ్యసించాల్సిన విద్యార్థులు పేరుకుపోయిన చెత్త చెదారంతో సావాసం చేస్తున్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాల్సిన విద్యార్థులు రోగాల బారిన ఇంటికెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ పిల్లలు ఇలాంటి వాతావరణంలో ఉండాల్సి రావడం బాధాకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    తూతూమంత్రంగా ఉత్తుత్తి స్పోర్ట్స్ స్కూల్
    కాంగ్రెస్ ప్రభుత్వం తూతూమంత్రంగా ఉత్తుత్తి స్పోర్ట్స్ స్కూల్ హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభించారు. ఇంకా ఇప్పటివరకు ఎలాంటి జీవో ప్రకటించలేదు.అరకొర వసతులు సమకూర్చి నెట్టుకొస్తున్నారు. రెండేళ్లుగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్పోర్ట్స్‌ పాఠశాలలో పారిశుధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పాఠశాల పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. దీంతో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు క్రీడలతో పాటు నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన పాఠశాల ఆవరణలోనే చెత్త పేరుకుపోవడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    ప‌ట్టించుకోని అధికారులు..
    చెత్త కారణంగా దోమలు, ఈగలు వృద్ధి చెందడంతో పాటు దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. అపరిశుభ్రత కారణంగా విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు ఎటువైపు కన్నెత్తి చూడడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.