Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జింబాబ్వేలో హెలికాప్ట‌ర్ కూలి ఏడుగురు మృతి

    Author VENKATESH | 01 Oct 2026, 11:16 AM | INTERNATIONAL
    జింబాబ్వేలో హెలికాప్ట‌ర్ కూలి ఏడుగురు మృతి

    జింబాబ్వేలో హెలికాప్ట‌ర్ కూలినఘ‌ట‌న‌లో ఏడుగురు మృతి చెందారు. జింబాబ్వే ఈశాన్య మారోండెరా గ్రామీణ ప్రాంతంలో బుధవారం ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ప్రముఖ వ్యాపారవేత్త, నలుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో సహా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురూ మరణించారని ప్రభుత్వ ప్రతినిధి నిక్ మంగ్వానా తెలిపారు. స‌మాచారం అందిన వెంట‌నే అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టార‌న్నారు.ఈ ప్రమాదంలో ఎవరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని మంగ్వానా చెప్పారు. అయితే విమానంలో ఉన్న ప్రయాణికుల సంఖ్యపై పోలీసుల కథనానికి, ప్రభుత్వ ప్రతినిధి చెప్పిన దానికి పొంత‌న లేక‌పోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ‌గా ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.