Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రంగురంగుల సీతాకోకచిలుకలు, వాటర్‌ బర్డ్స్‌ సందడి చూశారా..?

    Author VENKATESH | 01 Oct 2026, 11:31 AM | NATIONAL
     రంగురంగుల సీతాకోకచిలుకలు, వాటర్‌ బర్డ్స్‌ సందడి చూశారా..?

    ప్రకృతి ఎన్నో అందాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాలాన్ని బట్టి ప్రకృతిలో చోటుచేసుకునే మార్పులు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంటాయి. జీవరాశులు తమ మనుగడ కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వస్తూ వెళ్తుంటాయి. ప్రత్యేకించి పక్షులు కాలం, వాతావరణ మార్పులకు అనుగుణంగా తమకు అనుకూలమైన ప్రాంతాన్ని ఎంచుకుని వేల కిలోమీటర్లు దాటి వస్తుంటాయి. ఈ క్రమంలో కనిపించే దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.తమిళనాడులోని టెన్‌కాసి జిల్లాలో అలాంటి దృశ్యమే చోటుచేసుకుంది. జిల్లాలోని వెస్టర్న్‌ ఘాట్స్‌ కల్లార్‌ ఏరియాలో వివిధ రకాల జాతుల సీతాకోకచిలుకలు, వాటర్‌ బర్డ్స్‌ వచ్చి వాలిపోయాయి. రంగురంగుల సీతాకోకచిలుకలు, కొంగలు, నీటితో తేలియాడుతున్న పక్షులతో ప్రకృతి ప్రేమికులకు చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉన్న ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.