Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రెండు ఓటీటీల్లోకి రవితేజ మేనల్లుడి సినిమా..

    Author VENKATESH | 01 Oct 2026, 11:40 AM | Cinema
     రెండు ఓటీటీల్లోకి రవితేజ మేనల్లుడి సినిమా..

    మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన మాధవ్ భూపతిరాజు నటించిన ‘మారెమ్మ’ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. రూరల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన అందుకోలేకపోయిన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ వేదికలపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ‘మారెమ్మ’ సినిమా ఒక్క ఓటీటీకే పరిమితం కాకుండా రెండు ప్రముఖ డిజిటల్ వేదికల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. తెలుగు ఓటీటీ వేదిక ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 9 నుంచి రెండు వేదికల్లోనూ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘మారెమ్మ’ను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఓటీటీ విడుదలకు సంబంధించిన అధికారిక వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమైన ‘మారెమ్మ’పై రవితేజ అభిమానుల్లో కొంత ఆసక్తి నెలకొంది. అయితే థియేటర్లలో విడుదలైన తర్వాత సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ విడుదల నేపథ్యంలో సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది